ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి రెండోసారి ప్రసంగించగా ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు బయటపెట్టారు. భారత్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏప్రిల్ 21 వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు.
