తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న కేసులు ఏప్రిల్ 7 కల్లా కోలుకొని డిశ్చార్జ్ అవుతారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 114 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. స్వతహాగా నియంత్రణ పాటించి ఎక్కడి వారు అక్కడ ఉండాలి. రాష్ట్రంలో 19,313 మందిపై నిఘా ఉంది. నిఘాలో ఉన్న వ్యక్తుల పాస్‌పోర్టులు సీజ్ చేయాలని చెప్పాం. అప్రమత్తతే మనల్ని కాపాడుతుంది. ప్రజలు వందశాతం సహకరించాలి.
మంత్రులంతా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ఉండాలి. వ్యవసాయ, వైద్య, మున్సిపల్ మంత్రులు అటుఇటు తిరగాల్సి ఉంటుంది. మనకు కరోనా ప్రభావం అంతగాలేదు అయినా సీరియస్‌గా తీసుకుంటున్నాం. కరోనా సోకని దేశం లేదని రిపోర్టులు వచ్చాయి. ప్రజా ప్రతినిధులు అందరూ ప్రజలకు అండగా ఉండాలి సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు !