ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి వణికిస్తుంది. ఇందులో భాగంగానే అన్ని దేశాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే దేశంలో కూడా ఎక్కువశాతం కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో నిన్న ఆదివారం నాడు దేశ ప్రధాని మోడీ కర్ఫ్యూ విధించారు. దీనికి సానుకూల స్పందన రావడంతో దేశం 75జిల్లాలు లాక్ డౌన్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కాని ప్రజలు మాత్రం దానిని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కరోనా గురించి తేలిగ్గా తీసుకోవడం వల్ల ఇటలీ ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందో అందరు చూస్తూనే ఉన్నారు. డబ్బుకోసం పాకులాడి కుటుంబ ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి. ప్రభుత్వం చెప్పిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తే మీకే మంచిది. ఇందులో ముఖ్యంగా కొన్ని గమనిస్తే
- బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులను డైరెక్ట్‌గా తాకకుండా చేతులకు శానిటైజర్ రాసుకుని పట్టుకోండి.
- అలాగే పాల ప్యాకెట్లను, కూరగాయలను, ఫ్రూట్స్‌ని శుభ్రంగా కడిగి, చేతులను కూడా వాష్ చేసుకోవాలి.
- ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న తరుణంలో న్యూస్ పేపర్స్‌ని రద్దు చేయడం మంచింది.
- కొరియర్స్, ఇతరత్రా వాటి కోసం ఇంటి బయట ఓ ట్రై ఏర్పాటు చేసుకోండి.
- పని మనుషులకు నిర్భంద కాలం తప్పదు.
- ఆన్ లైన్ ఫుడ్ డెలివరీస్‌ని రద్దు చేయండి.
- మొబైల్ ఫోన్లు, రిమోట్ కంట్రోల్, కీ బోర్డ్స్ తరుచూ శుభ్రం చేసుకోవాలి.
- అత్యవసరంగా బయటకు వెళ్లి వస్తే.. వెంటనే స్నానం చేయాలి.
- ఇక వృద్ధులు ఈ కాలంలో వాకింగ్‌లకు వెళ్లకపోవడమే మంచిది