ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేసీఆర్ తరహాలోనే రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ ప్రభావం బాగా చూపించిన విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ నిర్మూలనపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. ఎల్లో మీడియా ‘తుమ్ములు, దగ్గులతో’ పచ్చ వైరస్ ను వదులుతూనే ఉంది. అధికార పీఠం నుంచి తరిమివేసినా చంద్రబాబు బ్యాచ్ తమ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. తస్మాత్ జాగ్రత్త!” అని అన్నారు.
ఇక మరో ట్వీట్ లో “అత్యంత బాధ్యతతో వ్యవహరించే జగన్ గారి పాలనలో ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సంతోషించాలి. అనుభవజ్ఞుడు అని చెప్పుకునే వ్యక్తిని తరిమేసి ఉండకపోతే ఇవాళ కరోనా నియంత్రణ కంటే తన ప్రచారం ఎక్కువగా ఉండేది. జాగ్రత్తల పేరుతో వాణిజ్య ప్రకటనలు జారీ చేసి పచ్చమీడియాకు వేల కోట్లు దోచి పెట్టేవాడు” అని అన్నారు.