Home / SLIDER / తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి

తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి

తెలంగాణలో ఆహార ధాన్యాలకు కొరత లేదు . బియ్యం , పప్పులు ఏ జిల్లాలో ఏ వ్యాపారి దగ్గర ఎంత స్టాక్ ఉందో ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది . ఒక్కోసారి ఒక పూట కూరగాయలు అందుబాటులో లేకపోయినా ఇంట్లో ఉన్న పప్పు దినుసులతో సరిపెట్టుకోవాలి . యాసంగిలోనే 38 లక్షల ఎకరాల్లో పంట రాబోతున్నది . మూడు నాలుగు రోజులు ఓపిక పడితే ప్రభుత్వం సుమారు 87 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు ఇంటింటికి అందించే బియ్యం , రూ. 1500 చొప్పున ఇచ్చే డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది . అందరికీ నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది . ఇప్పుడు కావాల్సిందల్లా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఉండడం . ఇంట్లో ఉండి అప్రమత్తంగా ఉన్న వారు నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళను అప్రమత్తం చేయడం .
 
 
 
తప్పని సరి బయటికి వెళ్లాల్సి వచ్చిన వారు మీ ముఖానికి మాస్కు లేదా ఖర్చీఫ్ కట్టుకోండి . ఇతరులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి . కొన్ని చోట్ల యువకులు క్రికెట్ ఆడుతున్నారు . ప్రభుత్వం సెలవులు ఇచ్చింది ఎవరి ఇంట్లో వారు ఉండి జాగ్రత్తలు తీసుకోవడానికి . ఆటలు ఆడడానికి , రెండు మూడు కుటుంబాలు కలిసి విందులు చేసుకోవడానికి కాదు . ఒకే అపార్ట్ మెంట్ లో ఉండే వాళ్ళు కూడా ఒకరి ఇంట్లోకి మరొకరు వెళ్లకుండా జాగ్రత్త పడితే మంచిది . అత్యవసరమైతే పక్క ఫ్లాట్ వారితో ఫోన్ లో మాట్లాడండి తప్ప రెండు కుటుంబాలు కూడా కలవకపోతేనే మంచిది .
 
 
 
కరోనా వైరస్ ఉన్న వ్యక్తి ఇచ్చిన పది రూపాయల నోటుకు , లేదా అతను ఇచ్చిన వస్తువుకు కూడా వైరస్ ఉంటుంది . వాటిని మీరు తాకి ఆ చేత్తో మీ నోరు , ముక్కు , కళ్ళ దగ్గర ఎక్కడ తాకినా మీకు ఆ వైరస్ వ్యాపిస్తుంది . ఒకటో రోజు నుండి 14 వ రోజు వరకు ఆ వైరస్ లక్షణాలు ఎప్పుడైనా బయట పడవచ్చు . ఇటలీ దేశంలో ప్రభుత్వం అప్రమత్తం చేసినా అక్కడి ప్రజలు పట్టించుకోలేదు . ఇప్పుడు ఆ దేశంలో తల్లి దండ్రులు చనిపోతే పిల్లలు శవాలను తీసుకెళ్లలేని దుస్థితి వచ్చింది . తెలంగాణ ప్రజల బాగు కోసం ఏం చేయడానికైనా సిద్దపడే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాటలు అందరి బాగు కోసమే . కంటికి కనపడని వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది . అనవసరంగా రోడ్ల మీదికి వెళ్లే వాళ్ళను హెచ్చరించి అప్రమత్తం చేయండి .
 
 
 
కరోనా కారణంగా ఇంట్లో ఉండిపోయిన వారు కరోనా వైరస్ విషయంలో మీకు తెలిసిన జాగ్రత్తలతో పాటు సోషల్ మీడియా లో , టీవీ ఛానళ్లలో వస్తున్న మనకు మేలు చేసే సమాచారాన్ని వీలున్నంత వరకు మీ మిత్రులు , బంధువులకు షేర్ చేయండి . అలాగే ఫేక్ మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండండి . ప్రభుత్వ అధికారిక , ముఖ్యమైన మీడియా ద్వారా వచ్చిన సమాచారాన్ని పంపి మీ ఆత్మీయులందరినీ అప్రమత్తం చేయండి .
 
సిటీలు , పట్టణాలల్లో కాలనీ అసోసియేషన్ల నాయకులు , గ్రామాల్లో సర్పంచులు , ఎంపీటీసీలు ఇతర ముఖ్యులు మీ కాలనీలోని , మీ గ్రామంలోని కిరాణా ఇతర నిత్యావసర సరుకుల షాపుల యజమానులతో ఫోన్ లోనే మాట్లాడి ఉన్న సరుకులను కొద్ది కొద్దిగా అందించమని చెప్పండి . ఎక్కువ సరుకులు ఒక్కరికే ఇవ్వవద్దని చెప్పండి . మీ మీద ఆధారపడి ఉన్న షాపుల యజమానులు మీరు చెబితే అర్ధం చేసుకుంటారు . ప్రభుత్వం వెంటనే ఎక్కడా నిత్యావసరాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నది . సంపన్నులు , సేవా గుణం ఉన్న వాళ్ళు , ప్రతి ఒక్కరు అవకాశం ఉంటే మీ ఇంటి ఎదురుగా , పక్కన ఉన్న వారికి వీలున్నంత వరకు సహకరించండి .
 
ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా వైరస్ మూడో దశలోకి చేరే ప్రమాదం ఉంది . గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం నిత్యావసర సరుకుల విషయంలో ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది . రెండు , మూడు రోజులకు నిత్యావసర సరుకులు ఉన్న వాళ్ళు కూడా వెంటనే బయటికి వెళ్ళకండి . అవసరమైతే ఇంటింటికి సరుకులు పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు . ఎవరి ఇళ్లల్లో వారు ఉండి జాగ్రత్తలు తీసుకోండి . అందరూ ఒకేసారి రోడ్ల మీదికి రావడం వల్ల షాపులు ఇతర చోట్ల ఒక్కరి కంటే ఎక్కువ మంది దగ్గర దగ్గర గా ఉంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది . సీఎం గారు చెప్పినట్లు మీరు మీ కుటుంబాన్ని , రాష్ట్రాన్ని , దేశాన్ని , ప్రపంచాన్ని రక్షించుకోవడం కోసం అత్యంత జాగ్రత్తగా ఉండండి . ప్రభుత్వ సూచనలను పాటించండి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat