కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు. తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. ప్రపంచ
ఆరోగ్య సంస్థ(W.H.O) సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు.
కరోనా వైరస్ గాలిలో ప్రయాణించలేదు.* COVID-19 వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ఆ తుంపర గాలిలో ఎంత సేపు
నిలిచి ఉంటే, అంతసేపు ఉంటుంది. అలా బయటకు వచ్చిన డ్రాప్లెట్స్ కుర్చీ, టేబుల్, తలుపులు, డోర్ నాబ్స్, బస్సు, ట్రెయిన్ లో ఉండే స్టీల్ రాడ్స్ మొదలైనటువంటి
ఉపరితలాలకు(surfaces)కి అంటుకొని ఉంటుంది. వాటిని మనం తాకి అదే చేతితో నోరు, ముక్కు, కంటిని తాకితే, మన శరీరంలోకి చేరుతుంది. ఇతరుల్ని తాకితే, వారికి
అంటుకుంటుంది.
కరోనా ఏ మార్గం ద్వారా ఒకరి నుండి ఒకరికి వెళుతుందో గుర్తు పెట్టుకొని, W.H.O సూచించిన క్రింది జాగ్రత్తలు పాటించాలి.
1. మీ చేతులను తరచుగా కడగాలి
——————————
బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ లో ఉన్న surfaces ని తాకడం వల్ల వైరస్ అంటుకుంటుంది కాబట్టి, చేతులను ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ తో రుద్దుకోవాలి. లేదా సబ్బు
మరియు నీటితో కడగాలి. అలా చేస్తే మీ చేతుల్లో ఉండే వైరస్లు చనిపోతాయి.
2. సామాజిక దూరాన్ని పాటించండి.
——————————–
దగ్గు లేదా తుమ్ము ఉన్నవారికీ మీకూ మధ్య కనీసం ఒక మీటర్ (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోండి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వారి ముక్కు లేదా నోటి నుండి
వచ్చే తుంపర(ద్రవ బిందువులు)లో వైరస్ ఉండవచ్చు. వారికి దగ్గరగా ఉండటం వల్ల ఆ బిందువులలో పాటు కరోనా వైరస్ ని పీల్చుకోవడం వల్ల COVID-19 రావొచ్చు.
3. కళ్ళు, ముక్కు మరియు నోరు తాకడం మానుకోవాలి. పూర్తి స్పృహలో ఉండి, ముఖాన్ని తాకే అలవాటును మార్చుకోండి. ఎందుకంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు కుర్చీలు,
టేబుల్స్, బస్సులో, ట్రెయిన్ లో సపోర్టు కోసం వాడే స్టీల్ రాడ్స్ వంటి ఉపరితలాలను చేతులతో తాకుతాము. అలా వైరస్లు చేతులకు అంటుకొని, మీ కళ్ళు, ముక్కు లేదా నోటి
ద్వారా శరీరంలోకి ప్రవేశిస్థాయి.
4. మీరు మరియు మీ చుట్టుపక్కల ప్రజలు శ్వాసకోశ పరిశుభ్రతను పాటించేలా చూసుకోండి. దగ్గు లేదా తుమ్ము ఉన్నప్పుడు మీ వంచిన మోచేయి లేదా టిష్యూ పేపర్ తో నోరు
మరియు ముక్కును కప్పాలి. అలా వాడిన టిష్యూ పేపర్ ని వెంటనే పారవేయాలి. ఇలా కాకుండా నేరుగా చేతులు అడ్డు పెట్టుకోవడం వల్ల, ఆ వైరస్ మీ చేతులకు అంటుకొని, ఇతర
ఉపరితలాలకు వ్యాప్తి చెందుతుంది.
5. మీకు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వైద్య సహాయం తీసుకోండి. స్థానిక ఆరోగ్య అధికారుల సూచనలను అనుసరించండి. వారి వద్ద తాజా
సమాచారం ఉంటుంది. ముందుగానే కాల్ చేస్తే, మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత మిమ్మల్ని త్వరగా సరైన ఆరోగ్య సదుపాయాన్ని కల్పిస్తారు.
6. COVID-19 వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో లేదా ఇటీవల(గత 14 రోజులు) సందర్శించి ఉంటే, ముందుగా స్థానిక ఆరోగ్య అధికారికి ఫోన్ చేసి సమాచారం
అందించండి. వారు అవసరమైన పరీక్షలు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతారు.