ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమీషనర్నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మురం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన కొంత సమయంలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతుంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ నిమ్మగడ్డతో కుమ్మక్కై లేఖను కేంద్ర హోంశాఖకు రాయించారని అంటున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “నిమ్మగడ్డ రాసినట్టు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు. అందులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయి. చంద్రబాబైనా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరు” అని అన్నారు.
