ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ కర్ఫ్యూను ఎవరికివారు విధిగా పాటిద్దామని సూచించారు.
కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణపై కలెక్టర్లు, పోలీసు, వైద్యారోగ్యశాఖ తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.