ఏపీ స్థానిక సంస్థల వాయిదా వివాదం సరికొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తూ, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీరును సుప్రీంకోర్ట్ తీర్పు తప్పుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో నీచమైన కుట్రకు పాల్పడ్డాడు. చంద్రబాబు వెనుకు ఉన్న బ్యాచ్ ఏవేవో ప్లన్స్ వేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలని యనమల గారు డిమాండు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. సీబీఐని నిషేధించినోళ్ళు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినోళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు. మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం? అనవసర ఖర్చులు తప్ప” అని అన్నారు.
