తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు కరోన వైరస్ ప్రభావం వల్ల ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దన్న ఆదేశాల మేరకు గత ఆరు సంవత్సరాలుగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తు తనను కంటికి రెప్పలా కాపాడుకోంటు వస్తూన్న నరేందర్ గౌడ్ ;ఉమారాణిల వివాహం ఈ రోజు భువనగిరి పట్టణం నందు వైఎస్ఆర్ గార్డెన్ లో జరిగినది.
ఈ వివాహానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాల్సి ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కరోనా వైరస్ ప్రభావం తగ్గించడం కోసం వివాహానికి వెళ్లకుండా వీడియో కాలింగ్ ద్వారా నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
తనకు స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వాదం ఇవ్వాలని మనస్సులో ఉన్న కూడా కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయాను అని నాకు మనసులో చాలా బాధ ఉన్నప్పటికీ కరోన వైరస్ ప్రభావాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వివాహంకు వెళ్లకుండా ఉండడం జరిగిందని. అదేవిధంగా ప్రముఖులు; ప్రజలు అందరు కూడా దీనిని ఆదర్శంగా తీసుకుని ఎక్కువగా జనసమూహం కాకుండా ఉండాలని అవసరమైతే తప్ప బయటికి వెళ్ళ కూడదని పిలుపునిచ్చారు.