జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొద్దిరోజుల క్రితం రెండేళ్ల క్రితం చనిపోయిన సుగాలి ప్రీతికి సంబంధించి ధర్నాచేసిన పవన్ తాజాగా ఆ తరహా కార్యక్రమం మరొకటి చేస్తున్నారు. మన నుడి మన నది అంటూ సమీక్షలు చేస్తున్నారు జనసేనాని.. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడడంతో వైసీపీ, టీడీపీలు ఎన్నికల్లో గెలిచేందుకు కసరత్తులు చేసుకుంటుండగా మరోవైపు కరోనా మహమ్మారి భయంతో ప్రజలంతా ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లు నిలిపివేయడంతో ఏ చేయాలో పాలుపోక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
