తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి ,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ట్విట్టర్ సాక్షిగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ”ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత కాలం ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు పార్టీకి చెందిన పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు ,ఇతర ముఖ్య నేతలు,కార్యకర్తలు మంత్రి ఈటలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.