దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్భయ దోషులకు అధికారులు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలుచేసారు. పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ కి ఉరి శిక్ష అమలు చేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన పవన్ జలాద్ ఉరి తీశారు. గురువారం రాత్రి ఉరి శిక్ష అమలు చేసేముందు ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. దోషులకు అన్ని, న్యాయ, రాజ్యాంగ అవకాశాలు పూర్తయ్యాయి. నిర్భయ ఘటన జరిగిన 8ఏళ్ళ తర్వాత శిక్షను అమలు చేశారు. ఉరికంభం వద్ద 48మంది భద్రతా సిబ్బందితో జైలు నెంబర్ 3న నలుగురు నిందితులను ఒకేసారి ఉరి తీశారు. ఒక్కో దోషి వద్ద 12 మంది గార్డులు ఉన్నారు. ఉదయం 4గంటలకు అల్పాహారం పెట్టి, వారికి వైద్య పరిక్షలు నిర్వహించారు. శిక్షకు ముందు వినయ్ శర్మ భోరున విలపించాడు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు నిందితులు చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశారు. ఉరి ఘటనపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అరగంట వరకు నిందితులు ఉరి కంభాలకు వేలాడారు. జైలు బయట మహిళలు, సామాజిక కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నిర్భయ తల్లి తండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళకు తమ అమ్మాయికి న్యాయం జరిగిందన్నారు. ఇక వారికి శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు ఇవాళ మృతదేహాలను అప్పగిస్తారు.
