ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టకేలకు వాయిదా పడ్డాయి. మన దురదృష్టం కొద్దీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది లేకుంటే ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు వెళ్లిపోయి ఉండేది. అయితే కాదేదీ కవితకు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు కరోనాను కూడా తన రాజకీయ లబ్ధికి వాడేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్నికల వాయిదావరకే కరోనాను వాడుకున్న చంద్రబాబు మరి కొద్దిరోజుల్లో కరోనా వ్యాధికి సంబంధిచి ప్రెస్మీట్లు పెట్టడం, కరోనాపై ఏపీ ప్రభుత్వం, జగన్ సర్కార్ విఫలమయ్యాయంటూ మాట్లాడడం కచ్చితంగా జరుగుతాయి. ఇప్పటికే జగన్ కరోనా గురించి అవాస్తవాలు, బాధ్యత లేకుండా మాట్లాడారని చంద్రబాబు విమర్శిస్తున్న విషయం తెలిసిందే
