తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజులకీ పెరిగిపోతుంది..ఇప్పటికే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన నేపథ‌్యంలో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. మార్చి 31 వరకు ఇప్పటికే విద్యాసంస్థలు మూసివేయగా…మాల్స్. జిమ్‌లు, ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులుతో సహా దేవాలయాలు, మసీదులు, చర్చీలను కూడా మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే టెన్త్ పరీక్షలను మాత్రం యథాతథంగా నిర్వహిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు టెన్త్ ఎగ్జామ్స్ తెలంగాణవ్యాప్తంగా జరుతున్నాయి. అయితే కరోనా తీవ్రత పెరిగిపోవడంతో టెన్త్ ఎగ్జామ్స్‌కు కూడా పోస్ట్ పోన్ చేయాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కాగా రేపు శనివారం జరగాల్సిన పరీక్ష యథాతథంగా జరుగుతుంది. అయితే సోమవారం నుంచి ఈనెల 30వరకు జరగాల్సిన పరీక్షలు మాత్రం వాయిదా పడనున్నాయి. . ఈనెల 29న అత్యున్నతస్థాయి సమావేశం తర్వాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి..? అనే విషయంపై ప్రభుత్వం తదుపరి నిర్ణయాన్ని ప్రకటించనుంది.
Tags 10 th exams carona effect postpone telangana