ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇండియా పరంగా చూసుకుంటే కరోనా కన్నా వేగంగా సోషల్ మీడియాలో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించే హల్ చల్ అవుతుంది. కరోనా గురించి బ్రహ్మం గారు ముందే చెప్పారని మొన్ననే వార్తలు వచ్చాయి. ఇక ఇదంతా పక్కనపెడితే తిరుపతి విషయానికి వస్తే ఇదివరకెన్నడు తిరుపతి ముసేస్తారనే ప్రస్తావనే రాలేదు. అలాంటిది ఇప్పుడు కరోనా దెబ్బకు టీటీడీ సైతం మూసివేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా బ్రహ్మంగారు ముందే చెప్పారట. ఒకప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే తేలిగ్గా తీసుకున్న వారే ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మక తప్పడం లేదు.