తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడమే కాకుండా విదేశాల నుండి వచ్చేవాళ్లను పలు పరీక్షలు చేస్తుంది.
ఈ క్రమంలో ఈ రోజు మరో రెండు కొత్తగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. విదేశాల నుండి వచ్చిన వారిలోనే ఈ కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తున్నాయి అని తెలిపారు.
కరోనా వైరస్ సోకిన వారికి ఐసోలేషన్ వార్డులో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజా రెండు కేసులతో కల్పి మొత్తం పదహారు నుండి పద్దెనిమిదికి పెరిగింది.