స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీం కోర్డు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ, తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రకటించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా ఎలా వేస్తారు..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటారా..అంటూ ఈసీని నిలదీసింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు మొదటినుండి ఏవేవో స్కెచ్ లు వేస్తూ కూర్చున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. నువ్వెన్ని కుట్రలు పన్నినా ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయం. శిఖండిని అడ్డం పెట్టుకుని నువ్వు చేసే యుద్ధం ఎల్లో మీడియాను ఉత్సాహపరుస్తుంది. కానీ పరాజయాన్ని మాత్రం నిలువరించలేదు” అని అన్నారు.
