ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనా వైరస్ ను జయించింది ఓ బామ్మ.. కరోనా మృతుల కేసులో ఎక్కువమంది ఎక్కువ వయస్సువాళ్ళు న్న నేపథ్యంలో ఏకంగా 103ఏళ్లు ఉన్న బామ్మ ఆ వైరస్ బారీ నుండి బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇరాన్ దేశానికి చెందిన 103ఏళ్ళ బామ్మ కరోనాను జయించింది. వారం రోజుల కిందట ఆమెకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ బామ్మను ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు చికిత్సను అందించారు.
తాజా ఆమె కోలుకోని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. అయితే ఇటీవల ఇరాన్ లో తొంబై ఒక్క ఏళ్ల వృద్ధుడు కూడా కరోనా బయటపడిన సంగతి విదితమే.