ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కి వెళ్ళగా అక్కడ టీడీపీ చెంప చెల్లుమనేలా తేర్పు వచ్చింది. అంతేకాకుండా ఎన్నికల అధికారిని మందలించింది. ఎన్నికలు ఎప్పుడు జరపాలన్నది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, కరోనాపై ఆంక్షలు పెట్టుకో సంక్షేమంపైన కాదు. ఎన్నికల కోడ్ తక్షణమే ఎత్తివేయాలని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి చెప్పడం జరిగింది. దీంతో ప్రజలకు ఊరట కలిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు “ఎలక్షన్ కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు ఊరట కలిగించాయి. పంపిణీ చేసే స్థలాల్లో గృహ నిర్మాణం కోసం సిమెంట్ ధరలను భారీగా తగ్గించేలా కంపెనీలను ఒప్పించడం సిఎం జగన్ గారి గొప్ప విజయం” అని ట్వీట్ చేసారు.
