మాస్ మహారాజ్ రవితేజ..టాలీవుడ్ మంచి ఎనర్జిటిక్ హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన నటనతో, డాన్స్, కామెడీతో అందరిని ఆకట్టుకుంటాడు. వరుస హిట్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇవన్నీ పక్కనపెడితే తాజాగా రవితేజ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న వచ్చిన డిస్కో రాజా కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. మరి ఈసారైన వచ్చే చిత్రం హిట్ అవుతుందా లేదా అని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు తాజాగా సమాచారం వచ్చింది..ఈసారి రవితేజ తమన్నాతో జతకట్టబోతున్నాడని దీనికి త్రినాద్ రావు దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుందని అంటున్నారు. తమన్నా తో నటించిన బెంగాల్ టైగర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక మిల్కీ బ్యూటీ తో మరోసారి లక్ పరీక్షించుకోనున్నాడు.
