రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లుగా బుధవారం ఓ లేఖ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల టీవీ మీడియాలో ఆ లేఖ వైరల్ అయ్యింది. అసలు రమేశ్ కుమార్ ఆలేఖ రాశారో లేదో కూడా స్పష్టం కాలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు భారీగా జరిగాయని, ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం ప్రభావం పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ఉద్దేశాలను లేఖలో తప్పుబట్టారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరినట్లు లేఖలో ఆ ఉంది. అలాగే కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్టు రమేశ్‌కుమార్ అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టుకు కూడా నివేదించారు.
అయితే రాష్ట్రంలోని శాంతిభద్రతల సమస్యపై గానీ, ఏకగ్రీవ ఎన్నికలపై సందేహాలు గానీ ఆయన వ్యక్తంచేయలేదు. కానీ ఈసీ పేరుతో వైరల్ అయిన లేఖలో కరోనా వైరస్ ప్రస్తావనే లేదు. కేవలం రాజకీయంగానే ఉన్నాయి. శాంతి భద్రతలపై సందేహాలు, ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలున్నాయి. నిజంగా రమేష్ కుమార్ ఈ లేఖ ఇచ్చిఉంటే సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆ అంశాన్ని ప్రస్తావించాలి కదా.. కానీ అలా జరగలేదు. అయితే ఈసీ పేరుతో టీడీపీ దొంగ లేఖలు రాయించి వాటిని తమ అనుకూల మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అర్ధమవుతోంది. ఇదే జరిగితే కచ్చితంగా చంద్రబాబు రాజకీయ క్రీడలో నిమ్మగడ్డ రమేష్ పూర్తిగా బలిపశువు కావడం ఖాయమంటున్నారు ఏపీ ప్రజలు.