తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభలకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ బారీన పడకుండా ప్రజలు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచిస్తూ ఐదు సలహాలు చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రజలు అవగాహనతో ముందుకు సాగాలని అన్నారు. కరోనాను అడ్డుకునేందుకు ఐదు సూత్రాలను సూచిస్తూ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అందులో ఇతర వ్యక్తులతో దూరం పాటించాలి.
వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. అవసరమైతే వైద్యసాయం తీసుకోవాలి. ఏవైన అనుమానాలు ఉంటే 104ను సంప్రదించాలి. అనవసర ప్రయాణాలు చేయద్దు అని మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సూచించారు.