తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పై అధికారులు డేగ కన్ను పెట్టారు. నిన్న సుమారు 1500మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండడంతో అడనపు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ప్రయాణికులు లేక మొత్తం వెలవెలబోతుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ ప్రదేశం మొత్తం జనసంచారం లేక కాలిగా కనిపిస్తున్నాయి. ఇక విదేశాల నుండి వస్తున్న ప్రతీఒక్కరిని చెక్ చేసి పంపుతున్నారు. ఎప్పుడూ రెండు మూడు మాత్రమే ఉండే అంబులెన్సులు ఇప్పుడు 15పైగా అక్కడ ఉన్నాయి. అధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
