ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించాడు. తద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం అనేది బయటపడింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “ఎన్నికలు వాయిదా వేసి పరువు నిలబెట్టినందుకు నిమ్మగడ్డ ఫోటోకు టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. నిజంగా కరోనా భయానికే ఎన్నికలు వాయిదా వేసి ఉంటే చంద్రబాబు స్టేట్‌మెంట్లు మరోలా ఉండేవి. వాయిదాతో పరాజయ భారాన్ని కొద్ది రోజులు తప్పించుకున్నాడు” అని అన్నారు.
