కరోనా సోకకుండా వినియోగించు మాస్క్లు, గ్లోవ్స్ లను సరిగ్గా వాడకపోతే ఇన్‌ఫెక్షన్‌లు మరింత వేగంగా విస్తరించి తద్వారా కరోనా త్వరగా వచ్చే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ కరోనాను కట్టడి చేసేందుకు భారీగా ప్రచారం చేస్తోంది. చేతులను శుభ్రం చేసుకోవాలని, ముఖాన్ని తాకరాదని, దూరం పాటించాలని సూచిస్తోంది. వైరస్ సోకిందని భావిస్తే మాస్క్ ధరించాలని, తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తోంది. ప్రతి ఒక్కరూ కరోనా భయంతో మాస్క్ లు, గ్లోవ్స్ ధరించడంతో వాటిని ఎక్కువగా వేసుకోని ఉండడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలిపింది. వైరస్ సోకకుండా మాస్క్‌లు కాపాడేందుకు పరిమితులున్నాయని, ప్రతిఒక్కరూ కచ్చితంగాచేతులను శుభ్రంగా కడుక్కోవాలనక్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైక్ ర్యాన్ ప్రజలకు ఈ సూచనలు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులను పరిశీలించే వైద్య సిబ్బందికి నెలకు 8.9 కోట్ల మాస్‌్నలు అవసరమని అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సిబ్బందికే మాస్క్ లు సరిపోని పరిస్ధితి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మాస్క్ లు వేసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలనే సూచనను పట్టించుకోవడం లేదని, మాస్క్ చేతితో తడుముతూ ఇదే తరహాలో వాడుతుండటంతో వీటి ద్వారా రోగాలు వ్యాపించే ప్రమాదం ముంచుకొస్తోందన్నారు. చర్మాన్ని తాకడం, చెవులు, కళ్లు, ముక్కు ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, చేతులు శుభ్రం చేసుకుని, ముఖం కడుక్కుని అప్పుడే మాస్క్ లు వేసుకోవాలని వాటిని కూడా మారుస్తూ ఉండాలని డబ్ల్యూహెచ్ ఓ ప్రతిపాదిస్తోంది.