కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు సగం మంది విద్యార్థులు తమ తమ చదువులకు దూరమయ్యారు అని యునెస్కో ప్రకటించింది. ఈ వ్యాధి విద్యారంగానికి అసాధారణ సవాల్ గా మారింది అని వ్యాఖ్యానించింది.
మొత్తం 102దేశాల్లో పూర్తిగా విద్యాసంస్థలను మూసి వేసింది. పదకొండు దేశాల్లో మాత్రమే పాక్షికంగా విద్యాసంస్థలు మూసేశారని పేర్కొంది. అయితే ఇండియాలోనూ అన్ని రకాల విద్యాసంస్థలను మూసి వేయడంతో పాటుగా పలు రకాల పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నారు.