Home / ANDHRAPRADESH / నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ఫేక్ లేఖ.. ఎల్లోమీడియాతో కలిసి చంద్రబాబు మరో కుట్ర…!

నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ఫేక్ లేఖ.. ఎల్లోమీడియాతో కలిసి చంద్రబాబు మరో కుట్ర…!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీం కోర్డు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ, తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రకటించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసినందున ఈసీ అధికారాల విషయంలో జోక్యం చేసుకోలేమంటూ ఎన్నికల వాయిదాపై మాత్రం న్యాయస్థానం స్పందించలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా ఎలా వేస్తారు..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటారా..అంటూ ఈసీని నిలదీసింది. అయితే సుప్రీం కోర్డ్ తీర్పు వెలువడగానే చంద్రబాబు మరో కుట్రకు తెరతీశాడు. ఏకంగా ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖకు రాసినట్లుగా చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం మార్చి 18 వ తేదీ సాయంత్రం హఠాత్తుగా ఓ లేఖ తెరపైకి వచ్చింది. అదీ చంద్రబాబు అనుకుల టీవీ చానళ్ల చేతికే మొదట అందింది. ఆ లేఖను తమ అనుకుల టీవీ చానళ్లతోపాటు టీడీపీ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయించాడు.

 

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరిగాయని ఆ లేఖలో రాయించాడు. ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ఉద్దేశాలను కూడా ఆ లేఖలో తప్పుబట్టారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను రమేశ్‌ కుమార్‌ కోరినట్లు లేఖలో ఉంది. అయితే కరోనా వైరస్‌ ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రమేశ్‌కుమార్‌ అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టుకు కూడా అదే నివేదించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనిగానీ, ఏకగ్రీవ ఎన్నికలపై సందేహాలు గానీ వ్యక్తం చేయలేదు. కాని ఎన్నికల కమిషనర్‌ పేరుతో వైరల్‌ అయిన లేఖలో అసలు కరోనా వైరస్‌ ప్రస్తావనే లేదు. శాంతి భద్రతలపై సందేహాలు, ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే నిజమైతే మరి సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించ లేదు? ఇక ఏకగ్రీవాలపై సందేహాలు నిరాధారమన్నది తేటతెల్లమవుతోంది.

 

 

ఇక ఈ వ్యవహారం పైన రాజకీయంగా దుమారం చెలరేగటంతో.. ఈసీ రమేష్ కుమార్ స్పష్టత ఇచ్చారు. తాను ఎటువంటి లేఖ రాయలేదని స్పష్టం. చేసారు. దీంతో జగన్ సర్కార్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈసీ పేరుతో చంద్రబాబు అనుకుల మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ లేఖపై డీజీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. చంద్రబాబు తన అనుకుల మీడియా ద్వారా ఈ లేఖను ప్రచారం చేసి..ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేందుకు కుట్ర పన్నాడంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా ఈసీ పేరుతో ఎల్లోమీడియాలో ప్రచారమైన లేఖ వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోంది. పోలీసుల విచారణతో దొంగ లేఖతో ప్రభుత్వంపై కుట్రలు చేసిన చంద్రబాబు పన్నాగం బట్టబయలు కానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat