ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఇప్పటికే రోజురోజికి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పార్కులు ఇలా అన్నీ ముసేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలోని కరోనా వైరస్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం మూసేసారు. టీటీడీ ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడికి విదేశాలనుండి కూడా భక్తులు వస్తారు. దీంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
