Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు షాక్…ఈసీ నిమ్మగడ్డకు కేంద్ర హోంశాఖ పిలుపు..పదవి వూస్టింగ్…?

చంద్రబాబుకు షాక్…ఈసీ నిమ్మగడ్డకు కేంద్ర హోంశాఖ పిలుపు..పదవి వూస్టింగ్…?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా వ్యవహారంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై సీఎం జగన్‌తో సహా, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు, టీడీపీని కాపాడుకునేందుకునే ఇలా కరోనా వంకతో ఎన్నికలను వాయిదా వేశారంటూ ఈసీ నిమ్మగడ్డపై వైసీపీ విమర్శలు సంధిస్తోంది. మరోవైపు నిమ్మగడ్డ వ్యవహార శైలి కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. సీఎస్‌కు రాసిన లేఖలో ఈసీ నిమ్మగడ్డ వాడిన భాష కూడా అభ్యంతకరంగా ఉంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ముందు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం నిర్వ‌హించ‌డం కుద‌ర‌ద‌ని, కావాలంటే క‌రోనాపై కేంద్ర‌ప్ర‌భుత్వం నియ‌మించిన జాతీయ టాస్క్‌ఫోర్స్ ను సంప్ర‌దించ‌వ‌చ్చు. టాస్క్‌ఫోర్స్ స‌రేనంటే…ఆరు వారాల కంటే ముందుగానే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించేందుకు క‌మిష‌న్‌కు ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌డంటూ నిమ్మగడ్డ ప్రభుత్వానికి హేళనతో కూడిన సమాధానం ఇచ్చాడు.

మరోవైపు సుప్రీంకోర్డ్ నిమ్మగడ్డ తీరును కడిగిపారేసింది. ఒకవైపున ఎన్నికలను నిరంతరాయంగా వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ ఎలా కొనసాగిస్తారు అంటే… ప్రభుత్వం, పాలన స్తంభించిపోవాలనా మీరు కోరుకుంటున్నారా..ఇందులో రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఈసీని సుప్రీంకోర్డు నిలదీసింది. అంతే కాదు తదుపరి స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్ట్ కోడ్ ఎత్తేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు లేఖ రాసాడంటూ చంద్రబాబు ఎల్లోమీడియాలో చేయించిన ఫేక్ ప్రచారం ఆయన్ని మరింత చిక్కుల్లో పడేసింది. ఆ లేఖలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిమ్మగడ్డ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఉంది. అంతే కాదు తనపై సీఎం జగన్, స్పీకర్‌తో సహా మంత్రులు విమర్శలు చేసిన తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖను కోరినట్లు ఆ లేఖలో ఉంది. కాగా ఈ లేఖ కావాలని ప్రభుత్వాన్ని బద్నాం చేసినట్లుగా ఉండడంతో రాజకీయంగా పెనుదుమారం చెలరేగింది. దీంతో ఈసీ నిమ్మగడ్డ రమేష్ తాను ఆ లేఖ రాయలేదని వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై వివాదం చెలరేగుతున్న దరిమిలా కేంద్ర హోంశాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్డ్ కూడా ఈసీ తీరును తప్పుపట్టడంతో కేంద్రం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెంటనే ఢిల్లీకి రావాలని ఈసీ నిమ్మగడ్డకు కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. కనీసం రాష్ట్ర ఆరోగ్య శాఖను సంప్రదించకుండా ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని కేంద్రం గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా కేవలం చంద్రబాబు చెప్పినట్లు ఆడుతూ ఎన్నికలను వాయిదా వేసిన ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చౌదరిని తప్పించాలని సీఎం జగన్ భావిస్తున్నారంట..ఈ మేర కు జగన్ ప్రభుత్వం కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు.. అందుకే వెంటనే రమేశ్ కుమార్ కు పిలుపు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్నికల వాయిదా వెనుక జరిగిన కుట్రపై కేంద్ర హోం శాఖ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుప్రీం కోర్డు తీర్పు తర్వాత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ఈసీ నిమ్మగడ్డ తమకు  లేఖ రాసినట్లు ఎల్లోమీడియా, టీడీపీ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై  కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఈ క్రమంలో ఫేక్ లేఖ కుట్రపై కూడా కేంద్రం ఈసీ రమేష్‌కుమార్‌ను వివరణ అడగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్లోమీడియాలో తన పేరుతో వైరల్ అయిన లేఖను తాను రాయలేదని ఈసీ నిమ్మగడ్డ మీడియాకు వివరణ ఇచ్చారు. అదే విషయాన్ని కేంద్ర హోం శాఖకు కూడా తెలుపనున్నట్లు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక చంద్రబాబు పాత్రపై కూడా కేంద్ర హోం శాఖ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం తెలుసుకునేందుకు కమిషనర్ రమేశ్ కుమార్ ను వెంటనే ఢిల్లీకి రమ్మన్నట్టు సమాచారం. ఈ క్రమంలో విచారణ చేసి కేంద్ర హోం శాఖ రమేశ్ ను తప్పించేట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ కేంద్ర హోం శాఖ ఈసీ నిమ్మగడ్డను తొలగిస్తే ఆయన స్థానంలో మాజీ ఐఏయస్ అధికారి రమాకాంత్ రెడ్డిని నియమించాలని జగన్ భావిస్తున్నారంట..మొత్తంగా తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం… స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన వ్యవహారరంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చివరకు తన పదవిని పోగొట్టుకునే పరిస్థితిలో పడ్డారు. మరి కేంద్ర హోం శాఖ ఈసీ నిమ్మగడ్డ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat