ఏపీ స్థానిక సంస్థల వాయిదా వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తూ, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీరును సుప్రీంకోర్ట్ తీర్పు తప్పుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో నీచమైన కుట్రకు పాల్పడ్డాడు. సీఎం జగన్‌ది ఫ్యాక్షన్ నేపథ్యమని, వైసీపీ నేతలతో తనకు, తన కుటుంబానికి ప్రాణభయం ఉందని ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసినట్లు ఓ లేఖ ఎల్లోమీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రభుత్వాన్ని బద్నాం చేసిన ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం నిలదీయంతో ఈసీ నిమ్మగడ్డ తాను ఆ లేఖ రాయలేదని వివరణ ఇచ్చుకున్నారు. దీంతో ఫేక్ లేఖతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు పన్నిన కుట్ర బట్టబయలైంది. కాగా తన పేరుతో చంద్రబాబు అనుకుల మీడియాలో ఓ లేఖ ప్రసారమవుతున్నా తొలుత ఈసీ నిమ్మగడ్డ ఖండించలేదు. దీంతో చంద్రబాబు నిమ్మగడ్డ అనుమతితోనే ఆయన లెటర్ హెడ్‌పై 5 పేజీలో లేఖ రాయించి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఎల్లోమీడియాలో ప్రసారం చేస్తున్నారని వైసీపీ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలున్నాయని మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆరోపించారు.. రమేష్ కుమార్ తన ఈమెయిల్ నుంచి పచ్చ మీడియాకు లెటర్ ఎందుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిల్ ద్వారా పచ్చ మీడియాతో కొంత సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రమేష్ కూమార్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్నికలను వాయిదా వేసే ముందు కనీసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని ఆయనకు తెలీదా అని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక రమేష్ కుమార్ పక్షపాత వైఖరి ఉందని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ ముసుగులో నిమ్మగడ్డ చంద్రబాబుకు కోవర్ట్‌గా పనిచేస్తున్నారని మంత్రి మోపిదేవి తీవ్రంగా దుయ్యబట్టారు. ఇలాంటి కమిషనర్‌తో ఎన్నికలు సజావుగా జరుగుతాయని తమకు నమ్మకం లేదని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకొని రమేష్ కుమార్‌ను కమిషనర్‌గా తొలగించాలని, మంచి సమర్థుడైన అధికారిని నియమించాలని కేంద్రానికి సూచించారు. మొత్తంగా ఈసీ నిమ్మగడ్డ వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది.