అరుంధతి, భాగమతి, రుద్రంమాదేవి, దేవసేన ఇలా ఏ పాత్రలోనైనా సరే తన నటనతో అందరిని అబ్బురమనిపించే అనుష్క టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లో కుర్రకారును పిచ్చేకించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఆమెకు కొట్టిన పిండి అని చెప్పాలి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరో ప్రభాస్ విషయంలో సంచలన కామెంట్స్ చేస్తూ కన్నీరు పెట్టుకుంది. క్యాష్ ప్రోగ్రాంలో యాంకర్ సుమ అనుష్కను ఒక ప్రశ్న అడిగింది. ఈ రెండింటిలో మీరు కచ్చితంగా ఒకటి వదులుకోవాలి అలాంటప్పుడు ఏం వదులుకుంటారు అని అడిగింది. ఇంతకు ఆ ప్రశ్నలు ఏమిటంటే ఒకటి సినిమాలు నటించడం మానేస్తారా? రెండవది ప్రభాస్ తో స్నేహం మానేస్తారా? అని అడిగితే వెంటనే ప్రభాస్ తో స్నేహం కోసం సినిమాలు వదులుకుంటాను అని చెప్పింది. ఈ మేరకు కన్నీరు పెట్టుకుంది.