రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానికి ఈడీ షాక్ ఇచ్చింది. రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురికి ఈడీ సమాన్లు జారి చేసింది. ఇప్పుడు ఇది అనీల్ అంబానికి కూడా తగులుకుంది. ఆయనకు కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ నుండి పలు ప్రైవేటు సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ రుణాలు కట్టడంలో వారు విఫలం అయ్యారు. ఇలా ఎగ్గొట్టినవారిలో అంబానీ కూడా ఉన్నారు. తీసుకున్న అసలుకు వడ్డీలు భారీగా పెరిగిపోయాయి. దాంతో అంబానికి ఈడీ నోటిసులు జారీ చేసింది. ఈ మేరకు నేడు ముంబై లో ఈడీ ముందుకు అంబాని హాజరుకానున్నాడు.
