కరోనా వైరస్ కారణంగా బుధవారం ఇటలీలో ఏకంగా 475 కొత్త మరణాలు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో ఎక్కువ మరణాలు నమోదు చేసిన దేశం ఇటలీనే. దాంతో ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 2978 కు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ వైరస్ సోకినవారి సంఖ్య 35,713 కు చేరుకుంది. మరోపక్క ఆదివారం 368 మంది మరణించడంతో ఇటలీలో రెండవ అత్యధిక మరణాలుగా నమోదు అయ్యింది. 6 కోట్ల జనాభా ఉన్న యూరోపియన్ దేశం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 34 శాతం COVID-19 మరణాలకు కారణమైంది.