Home / SLIDER / కరోనా వైరస్.. తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..

కరోనా వైరస్.. తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కరోనా వైరస్‌ విషయంలో నిన్న కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించాం. ఎలా ముందుకు పోవాలో అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ శుచి, శుభ్రత పాటించటంతో పాటు కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని సీఎం ప్రజలను కోరారు. ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని, ముందు జాగ్రత్త పాటించి మనల్ని మనం కాపాడుకుందాం.. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదామని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలకు ప్రజలను అనుమతించవద్దు. ఎక్కువ మంది గుమికూడకుండా ఉండటమే కరోనా కట్టడికి ముఖ్యసూత్రం.. జగ్‌నేకి రాత్‌ని కూడా రద్దు చేసుకుంటామని ముస్లీంలు అంగీకరించారు. ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఇప్పటికే రద్దు చేశాం.

గ్రామాల పారిశుద్ధ్యానికి కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి ఒక కమిటీని వేశాం. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా వారిపై నియంత్రణ ఉంటుంది. 84 రైళ్లు రాష్ట్రం నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. సరిహద్దు రాష్ర్టాల్లో 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. జాగ్రత్తలు తీసుకున్న చోట వైరస్‌ వ్యాపించడం లేదు. గ్రామ పారిశుద్ధ్యం, పట్టణ పారిశుద్ధ్యం పాటించి మనల్ని మనం కాపాడుకుందాం. షాదీఖానాలు, ఫంక్షన్‌హాల్స్‌ అన్ని ఇవాళ్టి నుంచి మూసివేస్తున్నామని ప్రకటించారు.

ఇప్పటి వరకు తెలంగాణలో 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు మాత్రమే విదేశాల నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగారు. మిగిలిన వారు ఇతర ఎయిర్‌పోర్టుల్లో దిగి బస్సులు, రైళ్లలో రాష్ట్రానికి వచ్చారు. వేరే ఎయిర్‌పోర్టుల్లో దిగి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించడం కష్టం. ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కూడా రోడ్డు, మార్గాల ద్వారా వచ్చిన వారే. వియత్నాం చైనా పక్కనే ఉంటుంది. అయినా ఆదేశానికి ఇబ్బంది లేదు. ఏ దేశంలో చర్యలు తీసుకోలేదో అక్కడ ఇబ్బంది ఉంది.

చైనా, ఇటలీ నిర్లక్ష్యం చేశాయి కాబట్టే ఇబ్బంది పడ్డాయి. మార్చి 1 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చాం. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరికి వారు రిపోర్టు చేయాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ సిబ్బంది, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నాం. వారం పాటు మూసివేయాలని ఆదేశించిన వాటి గడువు మార్చి 31 వరకు పొడగిస్తున్నాం. దేవాలయాలు, మసీదులు, చర్చీలకు ప్రజలు అనుమతించవద్దు. మంది గుమికూడకుండా ఉండటమే కరోనా కట్టడికి ముఖ్య సూత్రం.

పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ ప్రకటించారు. టెన్త్‌ పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేస్తున్నాం. మందిరాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీలు అన్ని మూసివేయాలని అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు సహకరించాలని కోరుతున్నాం. ఈ నెల 25వ తేదీన ఉగాది పండగ సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని ప్రజల కోసం లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తాం. నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి. కొరత సృష్టించే బ్లాక్‌ మార్కెట్‌గాళ్లను ఉపేక్షించం. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు పెంచాలని ఆదేశించాం. 200 మంది బంధువులకు మించకుండా రాత్రి 9 గంటల లోపే పెళ్లిళ్లు ముగించాలని విజ్ఞప్తి చేశారు. 1165 మంది అనుమానితులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. కొంత మంది ఇంటికి వెళతామన్న వారిని పంపిస్తున్నాం. వారిపై కూడా నిఘా ఉంచుతామని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat