ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమీషనర్‌గా తన విచక్షణా అధికారాలను అడ్డం పెట్టుకుని కేవలం చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఎన్నికలను వాయిదా వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నిమ్మగడ్డపై వచ్చిన ఆరోపణలపై ఆయన కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా గగ్గోలు పెడుతున్నారు. ఎలక్షన్ కమీషనర్‌నే ప్రశ్నించే అధికారం మీకు ఎవరిచ్చారంటూ చంద్రబాబు కస్సుబుస్సులాడుతున్నాడు. టీడీపీ నేతలంతా ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించడం చూస్తుంటే..చంద్రబాబుకు, నిమ్మగడ్డకు ఉన్న కమ్మనైన బంధం ఏంటో అర్థమవుతుంది.
గత టీడీపీ హయాంలో చంద్రబాబు తన సామాజికవర్గానికే చెందిన అధికారులను అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లోకి తెలివిగా చొప్పించాడు. ఆ క్రమంలో ఎలక్షన్ కమీషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని నియమించాడు. అంతే కాదు ఏకంగా నిమ్మగడ్డ రమేష్ కూతురు శరణ్యను ఏపీ ఆర్థికాభివృద్ధి మండలిలో అసోసియేట్ డైరెక్టర్‌గా నియమించి నెలకు అప్పనంగా 2 లక్షలు జీతం ఇచ్చాడు. ఇక బాబుగారి హయాంలో విదేశాల్లో పెట్టుబడులు రాబట్టడానికి అంటూ నెలనెలా ఫారిన్ టూర్లు తిరిగే బ్యాచ్ ఒకటి ఉండేది కదా. గత ఐదేళ్లు పెట్టుబడుల పేరుతో బాబుగారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని, విదేశాల్లో తిరుగుతూ, అక్కడ ఫైవ్ స్టార్ హోటళ్లలో సేద దీరి, వీధుల్లో పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేసేవారు కదా…బాబుగారితో పాటు ఆయన వెంట అధికారుల బ్యాచ్ కూడా వెళ్లేవారు..దండిగా ప్రజల డబ్బుతో జల్సాలు చేసేవారు. అలా నిమ్మగడ్డ రమేష్ గారి కూతురు శరణ్య కూడా ఏపీ ప్రభుత్వ ఖర్చుతో అనేక విదేశాలకు వెళ్లారని, అక్కడ స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసాలు చేసేవారని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో చంద్రబాబు నిమ్మగడ్డ ఫ్యామిలీకి చేకూర్చిన లబ్ది వ్యవహారం హల్‌చల్ చేస్తోంది.
అయితే 2019లో చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయి జగన్ సీఎం కాగానే సదరు నిమ్మగడ్డ శరణ్య తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. అప్పుడు తనకు ఈసీగా పదవి ఇవ్వడమే కాకుండా తన కూతురుకు కూడా నెలకు 2 లక్షల జీతంతో ఉద్యోగం ఇచ్చినందుకుగాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారు.. ఇలా అవకాశం రాగానే స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించి చంద్రబాబు రుణం తీర్చుకున్నారని ఎలక్షన్ కమీషన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చంద్రబాబు, నిమ్మగడ్డల కమ్మనైన బంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.