జన హృదయ నేత నిత్యము బంగారు తెలంగాణ కోసము కష్టపడే మహోన్నత వ్యక్తిత్వము నిరాడంబరతకి మారు పేరు టీఆర్ఎస్ ఎన్నారై సలహాదారు నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల మరియు ఇతర కోర్ కమిటీ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా కవిత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. నేడు హైదరాబాదులోని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నివాసంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ పత్రాలు కవిత సమర్పించారు.
అయితే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనమేనని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ TRS అభ్యర్థిగా కవిత సునాయాసంగా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్ 7న పోలింగ్ నిర్వహించి 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. 2015లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 వరకు ఉండటంతో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రక్రియ చేపట్టింది.