తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత శ్రీమతి కవిత పేరును ముఖ్యమంత్రి, ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. రేపు నామినేషన్ల పర్వానికి చివరి రోజు కావడంతో ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం రెండు గంటలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్సీలు,పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. అయితే నిజామాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. అందులో టీఆర్ఎస్ ఓట్లు 592 కాగా, కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 142, బీజేపీ ఓట్ల సంఖ్య 90గా ఉన్నాయి.