క్రికెట్ చరిత్రలో ఈరోజు యావత్ ప్రపంచం మర్చిపోలేని రోజు. మార్చ్ 17, 2007 ప్రపంచ కప్ లో భారత్ బంగ్లాదేశ్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో విషయం ఏమిటంటే అప్పటి ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పసికూన జట్టుగా భరిలోకి వచ్చింది. కాని అదే జట్టుపై భారత్ దారుణంగా ఓడిపోయింది. తద్వారా భారత్ అందరి దగ్గర ఎన్నో అవమానాలు ఎదురుకుంది. ఆ మ్యాచ్ ఎందరో ప్లేయర్స్ రూపురేఖలను మార్చేసింది. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలవబడే ద్రవిడ్ కెరీర్ ను సైతం మార్చేసింది. అది జరిగి నేటికి 13సంవత్సరాలు పూర్తయింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి గ్రేట్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ పసికూనా జట్టుతో ఓడిపోయింది. కేవలం 191 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది.
