ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇండియా లో కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అందరు చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనవంతు కృషిగా ట్విట్టర్ వేదికగా అందరిని జాగ్రత్తగా ఉండమని అన్నారు. “ఇది మనకి చాలా కఠినమైనది కాల్, కాని కొన్నిరోజులు తప్పదు. మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయడానికి మరియు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే సమయం.
మీకు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి, మీ కుటుంబంతో మరియు ప్రియమైన వారితో ఉండేలా చూసుకోండి . ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తుంది మరియు చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది.మీరు తరచుగా చేతులు కడుక్కోవాలని మరియు మీ వాతావరణాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోండి. వీలైనంతవరకు హ్యాండ్ శానిటైజర్లను వాడండి, మీరు అనారోగ్యంతో ఉన్నారని అనుకుంటే మాత్రమే మాస్కులు వాడండి” అని అన్నారు.