Home / POLITICS / రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

రైతు రుణమాఫీ మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

  1. రూ.1 లక్షల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ
  2. 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11 2018 ఈ తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు
  3. బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న క్రాప్ లోన్ల లిస్ట్ వ్యవసాయ శాఖ తయారు చేయనుంది.
  4. పట్టణాలు, మెట్రో పాలిటిన్ సిటీ హైదరాబాద్ లో తీసుకున్న లోన్లు రుణమాఫీకి వర్తించవు
  5. కుటుంబంలో ఎంత మంది పేరు మీద క్రాప్ లోన్ ఉన్నా, ఒక్కరి రుణం మాత్రమే మాఫీ. కేవలం రూ.1 లక్ష మాత్రమే.
  6. తొలి దశలో రూ.25వేలు లోపు ఉన్న రుణాలు మాఫీ
  7. 01.04.2014 నుండి 11.12.208 వరకు తీసుకున్న వ్యవసాయ లోన్ లకు రుణమాఫీ వర్తింపు.
  8. 2014 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న, రీషెడ్యూల్ చేసుకున్న రుణాల్లో 2018 డిసెంబర్ 11వ తేదీ వరకు ఉన్న బకాయిలు మాఫీ
  9. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని అందించనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat