ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్ వంటి అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక ఎన్నికలను వాయిదా వేయించి గెలిచినట్టు ఫీలవుతున్నాడు చంద్రబాబు. ఆరు వారాలు వాయిదా అంటే ఇక ఎలక్షన్లు ఉండవని కాదు బాబూ. నాయకులు పార్టీ వీడిపోతుంటే ఈ దిక్కుమాలిన పనికి ఒడిగట్టావు. నీ కుట్రలన్నింటికీ ప్రజలు తగిన శిక్ష విధించే రోజులు ఎంతో దూరం లేవు” అని అన్నారు.
