టీడీపీ మాజీమంత్రి పరిటాల సునీత కుమారుడు, పరిటాల శ్రీరామ్ తీరు ఆది నుంచి వివాదాస్పదమే. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్‌ల అండతో పరిటాల శ్రీరామ్ చెలరేగిపోయాడు. దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లు, భౌతిక దాడులు..భూకబ్జాలు..ఇలా పరిటాల శ్రీరామ్ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇప్పడు అధికారంలో లేకపోయినా శ్రీరామ్ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. రాప్తాడు నియోజకవర్గం, రామగిరిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీరామ్ ఏకంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో చొక్కా కాలర్ పట్టుకుని బెదిరించాడు.
తాజాగా మరో వివాదంలో శ్రీరామ్ చిక్కుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రామగిరిలోనే టీడీపీ శ్రేణులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే వైఎస్ విగ్రహాలను కూలుస్తామంటూ శ్రీరామ్ తీవ్ర వ్యాఖ‌్యలు చేశాడు రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని రామగిరిలో ఇది వరకూ వైఎస్ విగ్రహాలను పగులకొట్టి, తాడుకట్టి ఈడ్చుకుపోయామని..వచ్చేసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 15 నిమిషాల్లోనే వైఎస్ విగ్రహాలను కూలుస్తామంటూ శ్రీరామ్ రెచ్చిపోయి మాట్లాడాడు. ఇప్పుడు అధికారంలో లేము కాబట్టి వైయస్ విగ్రహాలను కూల్చివేయడం కుదరట్లేదు అన్నట్లుగా శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కార్యకర్తలను రెచ్చగొట్టిన టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చేసినట్టుగా రామగిరి పోలీసులు తెలిపారు. అయితే ఓడిపోయినా బుద్ది రాలేదు..మరణించిన నాయకులను అగౌరవపర్చేలా మాట్లాడకూడదన్న ఇంగితజ్ఞానం కూడా పరిటాల శ్రీరామ్‌కు లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తక్షణమే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా వైసీపీ పోలీసులను కోరింది. మొత్తంగా మళ్లీ అధికారంలోకి రాగానే 15 నిమిషాల్లో వైయస్ విగ్రహాలను కూలుస్తామంటూ పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రికత్తను రగిలిస్తున్నాయి.
అధికారం పోయినా కూడా తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఆగట్లేదు.
Publiée par Ravindra Reddy Ippala sur Dimanche 15 mars 2020