టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిగారి పుత్రరత్నం, ప్రతి రోజు ట్విట్టర్‌లో కూతెట్టె నారాలోకేష్ గారు చాలా రోజుల తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు..మా వాళ్లకు నోరుంది..మా ఇష్టం వచ్చినట్లు తిడతాం… సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడతాం..మేం ఏం చేసినా పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిందే అంటూ చిందులు వేశాడు. వివరాల్లోకి వెళితే..ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఓ మ్యారేజీ ఫంక్షన్‌లో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది.
అయితే విజయవాడ టీడీపీ కార్యాలయంలో సోషల్ మీడియా వింగ్‌లో పని చేసే నారాలోకేష్ అనుచరుడు నాయబ్ రసూల్ కాలికికట్టుతో ఉన్న ఎమ్మెల్యే ఆర్కే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..రాజా ప్యాంట్ఎలా విప్పుతావు రాజా…అంటూ కించపరుస్తూ పలు పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులను చూసి తీవ్ర మనసాప్తానికి గురైన ఆర్కే అనుచరులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మంగళగిరి పోలీసులు..పోస్టులు క్రియేట్ చేసిన నారా లోకేష్ అనుచరుడు రసూలును గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. సెక్షన్ 505, ఐపీసీ 67 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు రసూల్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు సిద్దమవుతుండగా అప్పుడే లోకేష్ స్టేషన్‌కు వచ్చి వీరంగం వేశాడు. అసలు రసూల్‌ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో తీవ్ర వాగ్వివాదానికి దిగాడు. రాజా ప్యాంట్‌ను ఎలా విప్పుతావు రాజా అనడంలో తప్పేముంది..కాలికి కట్టు ఉంది కాబట్టి అలా మావాడు అన్నాడు..అందులో తప్పేముంది అంటూ లోకేష్ అడ్డగోలుగా వాదించాడు.
పోలీసులు వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా మరింతగా రెచ్చిపోయాడు. నేను కూడా అవే పోస్టులు పెడతాను..నన్ను కూడా అరెస్ట్ చేస్తారా అంటూ లోకేష్ ఎదురు ప్రశ్నించాడు. లోకేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, అశోక్‌బాబు, రాజేంద్రప్రసాద్‌లు కాసేపు రెచ్చిపోయి చిందులు వేశారు. సోషల్ మీడియాలో పెట్టింది తప్పు అని చట్టంలో ఎక్కడ రాసి ఉందో చూపాలంటూ చిందులు వేశారు.లోకేష్ బ్యాచ్ ఓవరాక్షన్‌ను కాసేపు చూసిన పోలీసులు ఆ తర్వాత తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. చట్టం ఎవరికైనా ఒకటే..తమపని తాము చేసుకోవానివ్వాలంటూ పోలీసులు లోకేష్ బ్యాచ్‌కు వార్నింగ్ ఇచ్చారు. సీఐ శేషగిరి రావు, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి టీడీపీ నేతలతో మాట్లాడుతుండగానే..డీఎస్పీ దుర్గా ప్రసాద్ కూడా అక్కడకు వచ్చి గట్టిగా క్లాస్ తీసుకోవడంతో లోకేష్ బ్యాచ్ అక్కడనుంచి జారుకుంది. మీడియా సమావేశం ఉందని ఎల్లోమీడియా ఛానళ్ల ప్రతినిధులను పిలిపించిన లోకేష్ వారందరిని తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పబ్లిసిటీ కోసం కాసేపు ఎల్లోమీడియా కెమెరాల ముందు లోకేష్ ఓవరాక్షన్ చేశాడు. పోలీసులు జరిగింది వివరించి మీడియావారందరిని చిన్నగా అక్కడ నుంచి పంపించివేశారు. మీడియా కెమెరాలు కనిపించడకపోవడంతో లోకేష్ కూడా చిన్నగా అక్కడనుంచి జారుకున్నాడు. తప్పు చేసిన అనుచరుడిని వెనకేసుకువస్తూ లోకేష్ మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో వేసిన చిందులు చూసి నోరెళ్లపెట్టడం మంగళగరి ప్రజల వంతు అయింది.