Home / ANDHRAPRADESH / స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై మంత్రి వెల్లంపల్లి స్పందన..!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై మంత్రి వెల్లంపల్లి స్పందన..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనాపేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ కనీసం అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే ఎన్నికలను వాయిదా వేశారంటూ సీఎం జగన్‌తో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు సహజంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాయి. కానీ ఇక్కడ విచిత్రంగా ప్రభుత్వమే ఎన్నికలు పెడతామని ముందుకు వస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలు వద్దని పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మొదలు ఆయన మౌత్‌పీస్‌లు అయిన పవన్‌ కళ్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ, వామపక్షాలు అందరూ కూడా వైఎస్‌ జగన్‌పై ఈ 9 నెలల్లో అనేక ఆరోపణలు చేశారు. సింగిల్‌గా వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు వెళ్తుంటే ఎందుకు భయపడుతున్నారని వెల్లంపల్లి ప్రశ్నించారు.. వైఎస్‌ జగన్‌పై మీరు చేసిన అపవాదులు నిజమయితే ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారు కదా? ఎందుకు ఎన్నికలు వాయిదా వేయించారని చంద్రబాబును మంత్రి వెల్లంపల్లి నిలదీశారు. టీడీపీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్ పని చేస్తున్నారని, మీరు రాయించిన స్క్రిప్ట్‌నే ఎన్నికల కమిషనర్‌ చదివారని ఆరోపించారు. సీఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే ఎన్నికల కమిషనర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మంత్రి నిమ్మగడ్డను ప్రశ్నించారు.

 

రాష్ట్రంలో ఒక్కకేసు మాత్రమే పాజిటివ్‌గా నమోదు అయింది. మోదీ మొదలు సీఎం వైఎస్‌ జగన్‌ వరకు అందరూ శుభ్రత గురించి చెప్పారు. చంద్రబాబు మాత్రం కరోనాను ఆయనే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు మనోధైర్యం కలిగించాలి. రాష్ట్రంలో లేని కరోనాను ఉన్నట్లుగా చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికలు పూర్తి అయితే సుమారు రూ.5 వేల కోట్లు వస్తాయి. వైఎస్‌ జగన్‌పై వీరంతా పందుల్లా దాడి చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక చంద్రబాబు, కన్నా, పవన్‌..ఈ ముగ్గురిది ఒకే మాట. వేరే వేరే వేదికలు ఉన్నాయి అంతే. పవన్‌ మాట్లాడితే చాలు ఢిల్లీలో ఫిర్యాదు చేస్తా అంటున్నారు. ఈ 9 నెలల్లో పవన్‌ నీవేం చేశావ్‌. గతంలో పాచిపోయిన లడ్డూ అన్నావు. ఈ రోజు ఒక్క లడ్డైనా తీసుకురాగలిగావా?. ఇప్పుడేమో ఎన్నికలు రద్దు చేయాలంటున్నావు. నీవేవో షూటింగ్‌లు చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ ఎన్నికలు ఆపేయాలా? ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బీజేపీని అడగలేకపోతున్నారు. కన్నాను, పవన్‌ను, చంద్రబాబు కొడుకును ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి ఈ రాష్ట్రానికి మంచి జరుగకూడదని వీరి ఉద్దేశ్యమంటూ మంత్రి వెల్లంపల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీం కోర్టు తలుపు తట్టామని, తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నా చంద్రబాబు మెప్పుకోసమే ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని, ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్‌ మనసు మార్చుకొని ఎన్నికలు యధాతధంగా నిర్వహించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ డిమాండ్ చేశారు.మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాజుకున్న వివాదం రోజు రోజుకు మరింతగా రగులుతోంది. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat