స్పానిష్ ఫుట్ బాల్ కోచ్ ఫ్రాన్సికో గార్సియా (21) కరోనా సోకడంతో మరణించాడు. అతడు 2016 నుంచి అట్లేటికో పోర్టడ యూత్ టీమ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఈ వైరస్ బారిన పడి మరణించిన అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి ఇతడే. గతవారం కరోనా పాజిటివ్ అని తెలియగానే రీజినల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగా ఆదివారం మరణించాడు. దాంతో స్పానిష్ లోని జరిగే ఫుట్ బాల్ లీగ్స్ అన్నింటిని నిలిపివేశారు. అటు యూకే, ఫ్రాన్స్, ఇటలీలో కూడా ఇదే తరహాలో అన్ని బంద్ చేసారు. ఎంతో ఫేమస్ అయిన ప్రీమియర్ లీగ్, ఛాంపియన్స్ లీగ్ కూడా ఆపేశారు.
