కరోనా ప్రభావంతో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల విద్యాసంస్థలు,కోచింగ్ కేంద్రాలు,సినిమా హాల్స్, పార్కులు,జిమ్ లు అన్నిటినీ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు కూడా కరోనా వైరస్ సెగ తగిలింది. అందులో భాగంగా కరోనా నియంత్రణలో తమవంతుగా వారానికి మూడు రోజులు మాత్రమే హైకోర్టు పని చేయనుంది.
అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. బార్ అసోసియేషన్ల గదులు మూసివేయాలని నిర్ణయించింది. మరోవైపు కేసులున్న లాయర్లకు మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి అనుమతులు ఇస్తున్నాము. లాయర్లు,న్యాయమూర్తులు,సిబ్బంది కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.