ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అన్ని స్టేడియంలు మూసేసారు. అంతేకాకుండా రోజుకొకటి చొప్పున రాష్ట్రాల వారిగా ఆ ప్రభావం తాకిడిని బట్టి ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ బంద్ ప్రకటించగా తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం స్కూల్స్, మాల్స్, పార్కులు, ఇన్స్టిట్యూట్ లు అన్నింటిని నిలిపివేయమని సూచించింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. లోకల్ ట్రైన్స్ ఆపేయాలని కాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాబినెట్ ఆమోదం చేసినట్టు తెలుస్తుంది.
