తెలంగాణ రాష్ట్రంలో 2021ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే మహోత్తర లక్ష్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంది.
ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 12.71లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరోవైపు రానున్న ఏడాది పూర్తయ్యేలోపు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇది సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
సీతరామ ప్రాజెక్ట్ ద్వారా 2.88లక్షల ఎకరాలకు … దేవాదుల కింద 2.56లక్షల ఎకరాల అయకట్టును ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది.