మధ్యప్రదేశ్లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది. మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ కూడా రాసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం చర్చియాంసంగా మారింది. ఇది ఇలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్ రాజకీయంలో మరో బాంబు పేలింది. ఏకంగా 16మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసారు. దీనిబట్టి చూస్తే కాంగ్రెస్ స్థితి ఎంత దారుణంగా పడిపోతుందో అర్ధమవుతుంది.
